కూసుమంచి, జనవరి 19: ప్రతి ఒక్కరికీ కంటి చూపు మంచిగా ఉండాలని వారికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. గురువారం కూసుమంచిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. వైద్యారోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రవిచంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ల అద్దాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవవర్గ ప్రొగ్రాం ఇన్చార్జి డాక్టర్ బీ సైదులు, స్పెషలాఫీసర్ సంధ్యారాణి, క్వాలిటీ కంట్రోల్ అధికారి డాక్టర్ శ్రీధర్‌గౌడ్, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
చింతకాని, జనవరి 19: తెలంగాణ ప్రజల అంధ్వత్వ సమస్యల నివారణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా రెండోసారి ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని పల్లె ప్రజలందరూ సద్వినియోగించుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. వందనం గ్రామం లో కంటివెలుగు కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. రిజిస్టర్లు పాటించని సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిబిరానికి మొదటిరోజు స్పందన పట్ల సర్పంచ్ కోరిపల్లి సునీత, కార్యదర్శి చెవుల మహేశ్‌ను అభినంధించారు. మొదటిరోజు వందనంలో 90 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 20మందికి కళ్లఅద్దాలు అందజేసి నలుగురికి ఆపరేషన్‌కు సిఫారసు చేశామని వైద్యులు వివరించారు.
మధిర, జనవరి 19: మండలంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, బోనకల్లు మండలంలో జిల్లా క్షయనివారణ అధికారి సుబ్బారావు, చింతకాని మండలంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి గురువారం పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని రిఫర్ చేయాలని, మందులను అందించాలని వైద్యాధికారులకు సూచించారు. 1,300 మందికి పరీక్షలు నిర్వహించి 273 మందికి కళ్ల అద్దాలను అందజేసి, 107 మందిని ఆపరేషన్‌కు రిఫర్ చేశారు.
మధిరరూరల్, జనవరి 19: మాటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కంటివెలు గు శిబిరాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సర్పంచ్ మేడిశెట్టి లీలావతి ప్రారంభించి మాట్లాడారు. దెందుకూరు, మాటూరు గ్రామాల్లో ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పరిశీలించారు.
మధిరటౌన్, జనవరి 19: మధిర మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, వార్డు కౌన్సిలర్ సయ్యద్ ఇక్బాల్‌లతో ప్రారంభించారు. కలిసి ప్రారంభించారు.
బోనకల్లు, జనవరి 19: గార్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కంకనాల సౌభాగ్యం ప్రారంభించారు. తొలుత జడ్పీటీసీ మోదుగుల సుధీర్‌బాబుకు కంటి పరీక్షలు చేశారు. ముదిగొండ మండలం ముదిగొండ, అమ్మపేటలో కంటి వెలుగును ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభిచారు.
చింతకాని, జనవరి 19: వందనం, గాంధీనగర్ గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, సర్పంచ్‌లు కాళంగి లలిత, కే సునీత ప్రారంభించారు. వైద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తొలిరోజు 188 మందిని పరీక్షించి 60 మందికి కళ్ల అద్దాలు అందించామని, తొమ్మిది మందిని ఆపరేషన్లకు రిఫర్ చేసామన్నారు.
ఎర్రుపాలెం, జనవరి 19: రామన్నపాలెం గ్రామంలో గురువారం కంటివెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ దేవరకొండ శిరీష ప్రారంభించారు. తొలిరోజు రామన్నపాలెం, కండ్రీక గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 297 మందికి పరీక్షలు నిర్వహించి 75 మందికి కళ్లద్దాలు, 23 మందికి ఆపరేషన్‌కి సిఫారసు చేసినట్లు తెలిపారు.
ఖమ్మం రూరల్, జనవరి 19: మండలంలోని ఎం వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సర్పంచ్ మందటి సంధ్యారాణి ప్రారంభించి మాట్లాడారు. కంటి చూపు తగ్గిన వారిలో కొత్త వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారన్నారు. కంటి పరీక్షలు చేసి కళ్లఅద్దాలు అందజేశారు.
కూసుమంచి రూరల్, జనవరి 19: కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అగ్రహారంలో ఏర్పాటు చేసిన కంటివైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కంటి చికిత్సతో పాటు, ఉచితంగా కళ్లజోళ్లు, ఆపరేషన్లు చేస్తారని పేర్కొన్నారు. పోచారంలో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.
నేలకొండపల్లి, జనవరి 19: మండలంలోని నేలకొండపల్లి, బోదులబండ పీహెచ్‌సీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను జడ్పీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి ప్రారంభించారు. మండల ప్రత్యేకాధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరాం మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం కంటి వెలుగును నిర్వహించడం జరుగుతుందన్నారు.
తిరుమలాయపాలెం, జనవరి19: జోగులపాడు, రఘునాధపాలెంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ బోడ మంగీలాల్ ప్రారంభించారు. ఎందరో పేదలకు వెలుగులు నింపుతుందని చెప్పారు.