కూసుమంచి, ఫిబ్రవరి 10: ఈ నెల 18న జరిగే మహా శివరాత్రి వేడుకలకు కూసుమంచిలోని కాకతీయుల నాటి శివాలయం ముస్తాబవుతోంది. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జాతర కార్యక్రమాలు జరుగనున్నాయి. 19 సాయిత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటలలోపు నగర సంకీర్తన, శివపార్వతుల ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరుగుతాయి. శివ మాలధారణ భక్తుల ఇరుమూడులతో జాతర పూర్తవుతుంది. 18న తెల్లవారు జామున పంచామృతాలతో శివుడికి అభిషేకానికి, ఉదయం 5 గంటల నుంచి స్వామి వారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతర సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం బస్టాండ్ నుంచి శివాలయం వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. పార్కింగ్, తాగు నీరు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.
సాయిత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం శివపార్వతుల కల్యాణం, ప్రసాద వితరణ జరుగుతాయి. 19న ఉదయం నుంచి సర్వ దర్శనం, స్వామి వారి అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం 5 గంటలకు శివాలయం నుంచి కూసుమంచి సెంటర్ వరకు నగర సంకీర్తన నిర్వహిస్తారు. ఉత్సవమూర్తుల ఊరేగింపు, భజనలు కోలాటాలు, విచిత్ర వేషధారణల వంటివి ఏర్పాటు చేస్తున్నారు. 40 రోజులుగా శివమాలధారణ చేసిన భక్తులు ఆలయంలో పీఠం ఏర్పాటు చేసుకొని పూజల్లో పాల్గొంటుండగా 21 రోజులు 11 రోజులు శివమాలలు ధరించిన వారితో రెండు రోజులుగా 350 మంది శివస్వాములు ఆలయంలో పూజల్లో పాల్గొంటున్నారు. ఆలయ చైర్మన్ కొక్కిరేణి వీరస్వామి, సర్పంచ్ చెన్నా మోహన్, ఈవో శ్రీకాంత్, విజయలక్ష్మి, కమిటీ సభ్యులు ఈ జాతర ఏర్పాట్లలో భాగస్వాములవుతున్నారు.