ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 28 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరికలకు ఎప్‌సెట్ పరీక్షలు ఈ నెల 29, 30, మే 2 నుంచి 4వ తేదీ వరకు జరుగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్-1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ కోసం ఖమ్మం జిల్లాలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 7 కేంద్రాలు, ఇంజినీరింగ్‌కి 6 కేంద్రాలను ఎంపిక చేశారు.
29, 30 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు, మే 2 నుంచి 4వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి ఒక కేంద్రాన్ని, ఇంజినీరింగ్‌కు రెండు కేంద్రాలను ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్ పరీక్షకు 8,037 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షకు 3,837 మంది హాజరుకానున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఇంజినీరింగ్ పరీక్షకు 778 మంది, అగ్రికల్చల్ అండ్ ఫార్మసీ పరీక్ష 388 మంది రాయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.