ఖమ్మం రూరల్, ఏప్రిల్ 20 : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తండ కర్ణ గౌడ్ కు తెలుగు కీర్తి అవార్డు లభించింది. సోమవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మారెమ్మ గుడి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శ్రీ హేమ స్వచ్ఛంద సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా అవార్డుల ప్రధాన ఉత్సవం జరిగింది. విద్యారంగం, సాహితీ, సామాజిక, సేవారంగంలో ప్రతిభను కనపర్చినందుగాను కర్ణ గౌడ్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ చలమల హైమావతి అధ్యక్షత వహించగా బీసీ జేఏసీ నాయకుడు పాల్వంచ రామారావు, న్యాయ సలహాదారు లాయర్ పద్మావతి, కల్లపు సతీష్ కుమార్, శ్రీరామ అచ్యుత్ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా కర్ణ గౌడ్ కు తెలుగు కీర్తి పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు.