‘పాటల ఊట.. ఉద్యమ బావుటా ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో గురువారం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సాయిచంద్‌కు నివాళి అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
సాయిచంద్ మృతికిఎమ్మెల్యేల నివాళి
సత్తుపల్లి టౌన్, జూన్ 29 : తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రప్రగతిలో తన మాటలతో ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ చెరగని ముద్రవేశారని, అలాంటి వ్యక్తి చిన్న వయస్సులోనే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. ఉద్యమకారుడిగా పార్టీ రాష్ట్ర ప్రగతిని తెలిపేందుకు పాటల రూపంలో ప్రజలకు అర్ధమయ్యే విధంగా చైతన్యపర్చిన నాయకుడు సాయిచంద్ అని కొనియాడారు.
వైరాటౌన్, జూన్29: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాగాయకుడు సాయిచందు చిత్రపటానికి ఖమ్మం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే రాములు నాయక్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమం లో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ఉన్నారు.
కొణిజర్ల, జూన్29: తెలంగాణ ఉద్యమగాయకుడు, ప్రజాగాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మరణం కళారంగానికి తీరని లోటని ప్రజాగాయకులు గురువారం సంతాపం తెలిపారు. తెలంగాణ ప్రజలను ‘నాన్ననాన్న నీ మనంతా గొప్పదోనాన్న” అనే పాట ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న గాయకుడి మరణం బాధాకరమన్నారు. సంతాపం తెలిపిన వారిలో ప్రజాగాయకులు కాల్వకట్ల జాన్, మాచర్ల కృష్ణ, నకిరికంటి వెంకటేశ్వర్లు, డప్పు లక్ష్మణ్, మాచర్ల నరేశ్, ముత్తమాల రాజు ఉన్నారు.
ఆలయ అభివృద్ధికి విరాళం
కామేపల్లి,జూన్ 29 : తాళ్లగూడెంలో నూతనంగా నిర్మించిన తిరుపతమ్మతల్లి దేవాలయాబివృద్ధికి ఖమ్మం పట్టణానికి చెందిన అఖిల భారత యాదవ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చిలకల వెంకటనర్సయ్య, రామనర్సయ్య సోదరులు రూ.2 లక్షలు, బొందెల సత్యనారాయణ సింగ్ రూ. లక్ష, తాళ్లగూడెం పుచ్చకాయల కృష్ణ కుమార్తెలు నవ్య, చిత్తూరు భవ్య రూ.2 లక్షలను ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు.
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
ఇల్లెందు రూరల్, జూన్ 29: అంకితభావంతో పనిచేస్తే కచ్చితంగా ఉద్యోగులకు గుర్తింపు వస్తుందని సింగరేణి ఏరియా జీఎం జాన్ ఆనంద్ అన్నారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో గురువారం ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్న నాగమణికి సంస్థ తరఫున బెనిఫిట్స్ అందించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్వోటూజీఎం మల్లారపు మల్లయ్య, అధికారులు పాల్గొన్నారు.