ఖమ్మం, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొత్తగూడెం అర్బన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ మేరకు భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న 14 మంది తహసీల్దార్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తహసీల్దార్లు రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడి జిల్లా కలెక్టర్ పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
ఖమ్మం కలెక్టరేట్లో తహసీల్దార్‌గా పనిచేస్తున్న రంగా, కామేపల్లి తహసీల్దార్ తూమాటి శ్రీనివాస్, ఎర్రుపాలెం తహసీల్దార్ తిరుమలాచారి, నేలకొండపల్లి తహసీల్దార్ దారా ప్రసాద్, సింగరేణి తహసీల్దార్ రవికుమార్, పెనుబల్లి తహసీల్దార్ రమాదేవి, వైరా తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్, ఏన్కూరు తహసీల్దార్ ముజాహిద్, తిరుమలాయపాలెం తహసీల్దార్ పుల్లయ్య, మధిర తహసీల్దార్ కృష్ణ, సత్తుపల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు, వేంసూరు తహసీల్దార్ నారాయణమూర్తి, కొణిజర్ల తహసీల్దార్ సైదులు, బోనకల్ తహసీల్దార్ రమణలను బదిలీ చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో పనిచేస్తున్న తహసీల్లార్లు ఏ.రాజే్రందకుమార్, వి.శేషుకుమార్, పీవీ రామకృష్ణ, సీహెచ్.శేషగిరిరావు, లూథర్ విల్సన్, సీహెచ్.స్వామి, ఎంఏ.రాజు, వి.రవికుమార్‌లను మల్టీ జోన్-1 కింద ఖమ్మంకు బదిలీ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.