ఖమ్మం : రాష్ట్రంలో మరో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి (ACB raid) పట్టుబడ్డారు. ఖమ్మం జిల్లా తల్లడ( Tallada) మండలానికి చెందిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ తహసీల్ కార్యాలయంలో రెడ్‌హ్యండెడ్‌గా దొరికారు.
కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కోసం తల్లడ తహసీల్ కార్యాలయాన్ని( Tahasil Office) సంప్రదించిన బాధితుడిని అక్కడి అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం తహసీల్ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేషర్ శివాజీ రాథోడ్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న తహసీల్దార్ వంకాయల సురేష్‌కుమార్ ( Tahasildar) , రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలోత్ భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వీరిని వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశప్టెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.