పీఆర్సీ, పెండింగ్ డీఏలు ఇవ్వండి
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) పిలుపు మేరకు ఉపాధ్యాయులు ఎర్రుపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
- ఎర్రుపాలెంలో యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన
ఎర్రుపాలెం, ఆగస్టు 13 : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) పిలుపు మేరకు ఉపాధ్యాయులు ఎర్రుపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా యూఎస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు అనుమోలు కోటేశ్వరరావు, ముత్తయ్య మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లయినా అమలు చేయడం లేదని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలు పరిషరించాలని, లేదంటే ఈ నెల 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న హైదరాబాద్లో మహా ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూఎస్పీసీ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు, నుండ్రు వెంకటేశ్వరరావు, భూషణ్రాజ్, నీలం సైదారావు, టి.వెంకటకృష్ణ, నరాల సాంబశివరెడ్డి, సుధాకర్, ఎన్.జ్యోతి, ధనలక్ష్మి, రత్నకుమారి, నరసింహారావు, ఉపేంద్ర, సతీశ్, రవికుమార్, సుబ్బరామరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

