TSUTF | మధిర, మే 24: ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మధిర లోని సిపిఎస్ ఉన్నత పాఠశాల నందు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణా తరగతులను ఉద్దేశించి ఆయన శనివారం మాట్లాడారు.
వేసవి సెలవులను శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి దోహదం చేస్తాయని అన్నారు. 2025 26 విద్యా సంవత్సరం నుండి ప్రాథమిక స్థాయిలో నర్సరీ మరియు కేజీ తరగతులను ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలలను విలీనం చేసే ఆలోచన మానుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచడం కోసం ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వం చేపట్టబోయే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
అదేవిధంగా TSUTF ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25 నుండి 31 వ తారీకు వరకు జరిగే ఎన్రోల్మెంట్ జీపు జాతాలు ఉపాధ్యాయులు పాల్గొని ఎన్రోల్మెంట్కు కృషి చేయవలసిందిగా పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని, డీఎస్సీ 2024 ద్వారా నియామకమైనటువంటి ఉపాధ్యాయులకు నియామక తేదీని నవంబర్ 10 గా ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు ఇప్పించాలని, 2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయులకు వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు శ్రీనివాసరావు, నారపోగు సుధాకర్ మండల అధ్యక్షులు బండారు నాగరాజు, మహిళ ఉపాధ్యక్షురాలు కాజా సునీత, కోశాధికారి బైర్ల చెన్నయ్య, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ మల్ల రాజు, మండల కార్యదర్శులు ఊట్ల కొండలరావు, కూరపాటి రమేష్, ఎండి రఫీ, బొబ్బిలిపాటి రమేష్, దారిశెట్టి మహేంద్ర కుమార్, సంగు కృష్ణ ఆంజనేయులు,డేవిడ్ రాజు, పోతినేని రాజేష్, గోపీచంద్, అర్జున్, గుర్రాల జనార్దన్ రెడ్డి, జగన్నాథం, పఠాన్ బాజీ ఖాన్, పిట్టల రాము, పెంటి రాంబాబు, సంతోష్ కుమార్, త్రినేత్ర, రెహమాన్, ఆనంద్, సునీల్ కుమార్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.