మధిర, సెప్టెంబర్ 06 : జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలో సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో మధిర మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరులో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న బి.కృష్ణవేణి పాల్గొన్నారు. తన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను అబ్బురపరిచి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
అభినందనలు తెలిపిన వారిలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి, ప్రాంతీయ కార్యాలయం కన్వీనర్ ఏ.వినోదరావు, మధిర మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి నాగరాజు, ఈ.వీరయ్య, ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రహీం, కాజా సునీత, కోశాధికారి బి.చెన్నయ్య, డి.భీమ శంకరరావు, సీనియర్ నాయకుడు మహమ్మద్ రఫీ, మండల కార్యదర్శి జిబిఎంఎస్ రాణి, డి.కవిత, చేడె రాణి, జి భూలక్ష్మి, వి.లక్ష్మీ ప్రసన్న, జి.విజయ లక్ష్మి, రమాదేవి, మల్ల రాజు, షేక్ లాల్ అహ్మద్, వి.కొండలరావు, కె.ఆదాము, కె.రమేశ్, లంకా నాగేశ్వరరావు, ఎస్.కృష్ణాంజనేయులు, బొబ్బిళ్లపాటి రమేశ్, డి.మహేంద్ర కుమార్, పి.రాంబాబు, ఎన్.గోపీచంద్ ఉన్నారు.