ఖమ్మం, సెప్టెంబర్ 26: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన చాకలి ఐలమ్మ పాత్ర చరిత్రలో చిరస్మరణీయమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ కొనియాడారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఆమె చిత్రపటానికి తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ధైర్యం, త్యాగం, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆమె నిబద్ధత ఈ తరం నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐలమ్మను స్మరించుకోవడం అంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గౌరవించడం అని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కర్ణాటి కృష్ణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ షేక్ మక్బూల్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు బిచ్చాల తిరుమలరావు, మేకల సుగుణారావు, ఉబ్బలపల్లి నిరోషా, ఉద్యమకారులు పగడాల నరేందర్, నెమలికొండ వంశీ, ఆసిఫ్ అహ్మద్, నాగుల్ మీరా, నాయకులు వెంకట్, ఉస్మాన్, యలమద్ది రవి, షేక్ షకీన, ఇంటి మాధవి తదితరులు పాల్గొన్నారు.