భద్రాచలం, జూన్ 8 : భద్రాద్రి సీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శనివారం అంతరాలయంలోని మూలవరులకు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన,
ఆరగింపు, నిత్య హోమాలు, నిత్య బలిహరణం, సేవాకాలం తదితర పూజలను సంప్రదాయబద్ధంగా జరిపారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకొని వచ్చి శాస్ర్తోక్తంగా నిత్య కల్యాణం జరిపి, కల్యాణంలో పాల్గొన్న దాతలకు స్వామివారి ప్రసాదాలను, శేష వస్ర్తాలను అందజేశారు.