ఎర్రుపాలెం, మే 13 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల నూతన తాసీల్దార్గా శ్రీమతి కె.సునీత ఎలిజబెత్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖమ్మం కలెక్టరేట్ నుండి ఎర్రుపాలెంకు వచ్చిన ఆమె తాసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వకంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా చేరవేసే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.