మధిర, మే 01 : ఖమ్మం జిల్లా మధిరలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, ఎంఈఓ వై.ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వేసవి క్రీడా శిక్షణను క్రీడాకారులు, విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులు వేసవికాలంలో క్రీడల్లో శిక్షణ తీసుకుని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లాది వాసు, దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ పాడిబండ్ల సత్యంబాబు, కర్నాటి రామారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురంశెట్టి కిశోర్, టౌన్ అధ్యక్షుడు మిరియాల రమణగుప్తా, అడ్మినిస్ట్రేటర్ కమ్ ఇన్చార్జి చిన్ని, బ్యాట్మెంటన్ కోచ్ సునీల్, కబడ్డీ కోచ్ ప్రవీణ్‌కుమార్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు విజయభాస్కర్ పాల్గొన్నారు.