కారేపల్లి, జనవరి 23 : విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు కృషి చేయాలని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి అన్నారు. శుక్రవారం కళాశాలలో వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే వార్షిక పరీక్షలకు ప్రణాళికయుతంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కళాశాలలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థల దాత నేదునూరి నరేశ్, భవన నిర్మాణ దాత కుమ్మరికుంట్ల నాగేశ్వరరావు, పారేపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు శ్యామ్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లలిత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జయ, భీమవరపు శ్రీనివాసరావు, బోధన సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Karepally : ‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి’