విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, రాష్ట్రస్థాయి, జాతీయ పోటీల్లోనూ రాణించాలని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ జెల్లా సత్యనారాయణ పిలుపునిచ్చారు.
- ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ సత్యనారాయణ
అశ్వారావుపేట, ఫిబ్రవరి 5: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, రాష్ట్రస్థాయి, జాతీయ పోటీల్లోనూ రాణించాలని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ జెల్లా సత్యనారాయణ పిలుపునిచ్చారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని వ్యవసాయ కళాశాలలో యూనివర్సిటీ పరిధిలోని నిర్వహిస్తున్న అంతర్ కళాశాలల క్రీడా పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యతో పాటు క్రీడలకూ ప్రాధాన్యమిస్తున్నాయన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. క్రీడలతో మస్తిష్కాలు వికసించి మేధోవికాసానికి దోహదం చేస్తాయన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి, అదిలాబాద్ ఎస్సై జగదీష్ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో చదువుకుంటే విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను సులువుగా ఛేదించవచ్చన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యకు భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ ఉన్నదన్నారు. తమ కళాశాల పరిధిలో పండిం చిన ప్రతి పంటకు, ప్రతి మొక్కకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక సాంకేతికతను రైతులకు చేరువ చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ పరిశీలకుడు జె.సురేష్, కళాశాల ప్రొఫెసర్లు, పీడీలు, ఓఐఎస్వోలు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
అట్టహాసంగా ప్రారంభం
సోమవారం మొదలైన క్రీడలు ఈనెల 8 వరకు కొనసాగుతాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 వ్యవసాయ కళాశాలలకు చెందిన 425 మంది విద్యార్థులు అశ్వారావుపేటకు విచ్చేశారు. వీరంతా అథ్లెటిక్స్, ఖో ఖో, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్‌బాల్ తదితర పోటీల్లో పాల్గొంటారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

