భద్రాచలం, జనవరి 10 : విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని, తల్లిదండ్రుల ఆశలు తీర్చాలని తెలంగాణ రాష్ట్ర గురుకులాల డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం గిరిజన గురుకుల విద్యాసంస్థలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ స్టేట్ ఇగ్నైట్ ఫెస్ట్ ఇతోస్ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ముగింపు వేడుకలో గిరిజన గురుకులాల ఓఎస్డీ, సీఈఎస్ సుమలత, భద్రాచలం ఆర్సీవో వెంకటేశ్వర రాజు, వరంగల్ ఆర్సీవో డీఎస్ వెంకన్న, ఇతర జిల్లాల ఆర్సీవోలతో పాటు భద్రాచలం ప్రిన్సిపాల్ మెండెం దేవదాస్, వివిధ పాఠశాలల, కళాశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.