కారేపల్లి, మార్చి 26 : విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పించడం కూడా ఉపాధ్యాయుల బాధ్యతేనని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ అన్నారు. సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లిలో గల సమీకృత గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగదులను పరిశీలించారు. వసతి గృహ భవనంలోకి వెళ్లి వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
తరగతి గదుల్లోకి వెళ్లిన అదనపు కలెక్టర్ విద్యార్థులు ధరించిన దుస్తులు, హెయిర్ కటింగ్, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బోధన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా,,అంతరాయం, హై,లో ఓల్టేజీ సమస్యల వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు ఆదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆమె విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసి పాఠశాల ఆవరణలో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Tribal Boys Ashram School : విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పాలి : అధనపు కలెక్టర్ శ్రీజ