రఘునాథపాలెం, మే 9: ఇంటర్ ఫలితాల్లో రఘునాథపాలెం తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల బాలికల-1 విద్యార్థినులు సత్తా చాటారు. సెకండియర్లో ఏ.కావ్య 975, రిజ్వానా 967 మార్కులు సాధించి కళాశాల మొదటి, ద్వితీయ స్థానాల్లో టాపర్లుగా రాణించారు. బైపీసీలో 973 మార్కులతో షేక్ సమీరా, 972 మార్కులతో కరీమున్నిసా టాపర్లుగా నిలిచారు. ఫస్టియర్లో ఫహిమా ఫిర్దౌస్ 459, షేక్ లాస్య 437, బైపీసీలో ఎం.నిషిత 422, షేక్ రేష్మ 418 మార్కులతో మొదటి, రెండో స్థానాల్లో నిలిచారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను మైనారిటీ గురుకులాల సెక్రటరీ షఫియుల్లా, జిల్లా మైనారిటీ అధికారులు ముజఫర్, మహమూదీ, ఎంజే అరుణకుమారి, జీమీల్పాషా, సీతారాములు, అఫ్రోజ్, ప్రిన్సిపాల్ అబిదా అభినందించారు.
రఘునాథపాలెంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాలలో ద్వితీయ ఎంపీసీలో జే.బాలాజీ 972 మార్కులతో కళాశాల టాపర్గా నిలిచాడు. జే.నవీన్ 970, డీ.అనిల్ 969 మార్కులు సాధించారు. సెకండ్ బైపీసీలో పీ.రాకేశ్ 973, డీ.రాజేందర్ 972, ఎన్.రంగా 968 మార్కులతో సత్తా చాటారు. ఫస్ట్ ఎంపీసీలో విక్రమ్నాయక్ 466, శ్రీరాం 464, సుభాశ్ 464 మార్కులు, బైపీసీలో ఏ.ఉమేశ్ చంద్ర 433, వీ.తరుణ్ 431, జే.ఆకాశ్ 428 మార్కులతో టాపర్లుగా నిలిచారు. కళాశాల నుంచి పరీక్ష రాసిన విద్యార్తులందరూ ఉత్తీర్ణులై వందశాతం ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఎం.బాలస్వామి తెలిపారు.