రాములోరి పెండ్లికి ముహూర్తం ఖరారు
దక్షిణ అయోధ్యపురి భద్రాద్రిలో కొలువైన రామయ్య కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆలయ వైదిక కమిటీ ఈ మేరకు సోమవారం ఆలయ ఈవో రమాదేవికి నివేదిక అందించింది.
- వచ్చే నెల 17న శ్రీరామనవమి.. తర్వాతి రోజు మహాపట్టాభిషేకం
భద్రాచలం, మార్చి 4: దక్షిణ అయోధ్యపురి భద్రాద్రిలో కొలువైన రామయ్య కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆలయ వైదిక కమిటీ ఈ మేరకు సోమవారం ఆలయ ఈవో రమాదేవికి నివేదిక అందించింది. ఏప్రిల్ 17న పట్టణంలోని మిథిలా ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు అంగ రంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. తదుపరి రోజు రామయ్యకు మహాపట్టాభిషేకం చేయనున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఇదే నెల 9 నుంచి ఆలయ సన్నిధిలో 23వ తేదీ వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్ని తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. తొలిరోజు అర్చకులు ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. రుత్విక్ వరణం, రక్షా బంధనం, స్నపన తిరుమంజనం, పుట్టమన్నుతో పూజ, కల్పవృక్ష వాహనంపై రామయ్యకు తిరువీధి సేవ, పంచాంగ శ్రవణం చేయనున్నారు. 13న మండల లేఖనం, కుండ, కలశ, అలంకరణాదులు, సార్వ భౌమ సేవ, 14న గరుడ ధ్వజ పట లేఖనం, పటావిష్కరణ, గరుడ ధ్వజాధివాసం, 15న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీ తాడనం, దేవతాహ్వానం, బలి సమర్పణ,
హనుమంత వాహన సేవ, 16న గరుడ వాహన సేవ, ఎదుర్కోలు సేవ, 19న సదస్యం, స్వామివారికి హంస వాహన సేవ, 20న తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వవాహన సేవ, 21న స్వామివారికి ఊంజల్ సేవ, సింహ వాహన సేవ. 22న వసంతోత్సవం, హవనం, గజవాహన సేవ, 23న చక్రతీర్థం, పూర్ణాహుతి, శేష వాహన సేవ, ధ్వజారోహణం, ద్వాదశ ప్రదక్షిణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు స్వామివారి నిత్యకల్యాణం, దర్బార్ సేవలు, ఏప్రిల్ 9 నుంచి మే 1వరకు పవళింపు సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

