ఖమ్మం రూరల్, మార్చి 24 : ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 25&26 న జరిగే జాతీయస్థాయి టెక్నీకల్ &కల్చరల్ ఫెస్ట్ శ్రీ చైతన్య ఉత్సవ్- 26 లో సామాజిక సేవ అనే అంశంలో భాగంగా మంగళవారం ఖమ్మం పట్టణంలోని 13 అనాథ అలాగే వృద్ధాశ్రమాలను సందర్శించి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు వితరణ ఇవ్వడం జరిగిందని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి నారాయణ తెలిపారు. బ్యాంక్ కాలనీలోని ఈశ్వరమ్మ ప్రశాంతి సదన్, జీవన్ సంధ్య ఆశ్రమం ఎన్ఎస్పి క్యాంప్, భవ్య శ్రీ ఓల్డేజీ హోమ్ నాయుడుపేట క్రాస్ రోడ్, మెఫీ స్వచ్ఛంద సేవా సంస్థ ఫర్ చిల్డ్రన్స్ పెద్ద తండా, నేనున్నాను ఓల్డ్ ఏజ్ హోమ్, మదర్ థెరిస్సా ఆశ్రమం బల్లేపల్లి, నేనున్నాను ఫౌండేషన్ ని కళాశాల విద్యార్థులు, సుమారు 500 మంది అనాథ, వృద్ధ ఆశ్రమాల్లో ఉన్న వారికి కావాల్సిన నిత్యవసర సరుకులు అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలోని స్థితిగతులపై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విద్యార్థులను అభినందిస్తూ, సమాజంలో వివిధ కారణాల చేత ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో నివసిస్తున్న వారికి సహాయం చేయడం ద్వారా విద్యార్థులకి సమాజంలో వాస్తవ పరిస్థితులు అవగాహన చేసుకుని, ఎప్పుడూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ప్రేమానురాగాలు చూపాలని కోరారు. కళాశాల డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు చదువులోనే కాకుండా సమాజంలో అన్ని రంగాలలో ముందుండేలాగా ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ డీన్ డాక్టర్ సుదర్శన్, ఏఓ వైశాలి, ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ ఆఫీసర్ రాజేశ్, డిప్లొమా ఇన్చార్జి కృష్ణ ప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రణతి, డాక్టర్ చార్యులు, శ్రీకుమార్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అనాథ, వృద్ధాశ్రమాలకు శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ భారీ వితరణ