దమ్మపేట, జనవరి 23 : మారుమూల గ్రామాల్లో యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నదని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని జమేదారుబంజరులో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక క్రీడాకారులతో పలు క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
క్రీడా మైదానాల వల్ల మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని యువకులు క్రీడలపై మరింత ఆసక్తిని కనబరిచే వీలుంటుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, సర్పంచ్ పాశం సుగుణ, ఉప సర్పంచ్ కుంజా రాజు, దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్, మన్నెం అప్పారావు, తాటి పోతురాజు, అబ్దుల్ జిన్నా, వార్డు సభ్యులు గంగాధర్, కారం విజయలక్ష్మి, కణితి పద్మ, నాగలక్ష్మి, నాయకులు సూరిబాబు, ముత్తేశ్వరరావు, రాంబాబు, బేతి నర్సయ్య, కారం నగేశ్, మడివి వెంకటేశ్, కాటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.