పాల్వంచ, ఫిబ్రవరి 27 : వేతన సవరణను తక్షణమే చేపట్టాలని కోరుతూ పాల్వంచలోని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమైన స్పాంజ్ ఐరన్, ఎన్.ఎం.డి.సి(Sponge NMDC) కర్మాగారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. 2025 జనవరి లో స్ట్రైక్ నోటీస్ ఇచ్చి నెల రోజుల దాటినా యాజమాన్యం స్పందించకపోవడం పట్ల కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిల్ యూనిట్ ఎన్ఎండీసీ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీల ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ..పాల్వంచలోని యూనిట్ ను అభివృద్ధి చేయాలని, కర్మాగారంను తిరిగి తెరిచి ఉత్పత్తిని చేపట్టాలన్నారు.
అలాగే దీనికి అనుబంధంగా మరొక కర్మాగారాన్ని నిర్మించి పాల్వంచ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో INTUC నాయకులు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బానోత్ బాలు నాయక్, వైస్ ప్రెసిడెంట్ భద్రం, సెక్రటరీ అగరత్తయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, లాలేందర్, లక్ష్మణ్, మహిళా కార్మిక సంఘం నాయకురాళ్లు రుక్యా,శీనమ్మ,CITU నాయకులు ఉపేష్, తదితరులు పాల్గొన్నారు.