కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 8: పోలీస్‌స్టేషన్‌లో వర్టికల్స్ వారిగా విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు అన్నారు. మంగళవారం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. సిబ్బందికి చెందిన ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.
బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఆయన వెంట కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్, వన్‌టౌన్ సీఐ కరుణాకర్, టూ టౌన్ సీఐ ప్రతాప్, త్రీ టౌన్ సీఐ శివప్రసాద్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు ఉన్నారు.