ఖమ్మం అర్బన్/ బోనకల్లు/ వేంసూరు/ ఇల్లెందు, ఆగస్టు 12: ఎన్నికల ముందు ఇచ్చి న హామీలను నెరవేర్చాలని, అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయు లు బుధవారం తహసీల్దార్ కార్యాలయాలు, పాఠశాలల ఎదుట బ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. అధికారులకు వినతులు సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, ఆరు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉ ద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టాలని కోరా రు. లేదంటే సంఘా ల ఆధ్వర్యంలో పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి ల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, 19న కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాలు, చివరిగా చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.