మామిళ్లగూడెం, జనవరి 25: పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ఐడీవోసీలో గురువారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో శాఖల వారీగా సమీక్షించి మాట్లాడారు. అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాల ప్రగతిపై శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులతో సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, అధికారులు, ఉద్యోగులకు ఉత్తమ సేవా పురసారాల విషయంలో అన్ని పారామీటర్లను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, వివిధ శాఖల అధికారులు విద్యాచందన, సోమశేఖర్‌శర్మ, మహ్మద్ గౌస్, సత్యనారాయణ, జ్యోతి, సత్యనారాయణరెడ్డి, గణేశ్, జయప్రకాష్, అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న గణతంత్ర వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ సునీల్‌దత్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రిహార్సల్స్ తదితర ఆంశాలపై చర్చించారు. జెండా ఆవిషరణ, ముఖ్య అతిథి ప్రసంగం అనంతరం నిర్వహించే సాంసృతిక కార్యక్రమాలపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు. పోలీసు అధికారులు కుమారస్వామి, హరికృష్ణ, ప్రసన్నకుమార్, నర్సయ్య, సుశీల్‌సింగ్, స్వామి, కామరాజు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.