– ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ కు బీఆర్ఎస్ నాయకుల వినతి
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 07 : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలను తక్షణం అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సోమవారం పార్టీ నాయకులతో కలిసి వేణుగోపాల్ జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ కు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలతో కూడిన హామీలను ఇవ్వడం జరిగిందన్నారు.
అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తున్న ఏ ఒక్క పథకం పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. మహిళలకు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుద్యోగులు, విద్యార్థులను ప్రభుత్వం మోసం చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనియెడల ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పేరం వెంకటేశ్వర్లు. జరుపుల లక్ష్మణ్ నాయక్, ముత్యం కృష్ణారావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, గుడిబోయిన దర్గయ్య, సంజీవరెడ్డి, భాస్కరరావు, వెంకన్న, బానోతు కృష్ణ, చుంచు నారాయణ, వెంపటి ఉపేందర్, మైబెల్లి సాహెబ్, కర్లపూడి రవి పాల్గొన్నారు.