– ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
– అమ్మపాలెంలో సర్ కార్యక్రమ పరిశీలన
వైరా, జూలై 18 : వైరా నియోజకవర్గంలోని అమ్మపాలెం గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని శనివారం వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోతు చంద్రావతి పరిశీలించారు. గ్రామంలో SIR కార్యక్రమం సక్రమంగా అమలవుతోందా, ఎంతమందికి గణన ఫారాలు పంపిణీ చేశారు, ఫారాలు నింపడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాలను ఆమె స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, బీఎల్ఓతో మాట్లాడి ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని వృద్ధులను పలకరించి, వారి ఓటరు వివరాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామ ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమం అనంతరం బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా అప్రమత్తంగా పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కిలారు మాధవరావు, మాజీ సర్పంచ్ చిలుకూరి నాగేంద్రమ్మ, బీఎల్ఏ కామసాని నాగేశ్వరరావు, జడ రాజ్‌కుమార్, తేజావత్ రామ్మూర్తి, తేజావత్ రామ, గ్రామ అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబు, రావెల శ్రీనివాసులు, పుప్పాల రామలింగం, దారగని వెంకటేశ్వర్లు, ఎస్కే ఇబ్రహీం, ఎస్కే చాంద్‌మియా, చవగాని సైదులు, చవగాని వెంకట పిచ్చయ్య, పసుపులేటి కృష్ణయ్య, అయినాల ముక్కంటి, చిలుకూరి ప్రసాద్, బానోతు నాగేశ్వరరావు, గుగులోత్ కృష్ణ, బొమ్మగాని వీరయ్య, జడ లక్ష్మయ్య, జడ సంగయ్య, అంబాల అయోధ్య, అంబాల ఉదయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలి : మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి