కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 14 : సీఎంపీఎఫ్ నూతన నిబంధనల ప్రకారం ఆన్రోల్లో ఉన్న ఉద్యోగులందరి వద్ద నుంచి నామినేషన్లు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్ అన్నారు. సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సీఎంపీఎఫ్ ట్రైపాట్రైట్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సీఎంపీఎఫ్ నిల్వలను వీలైనంత త్వరగా తెలియజేయాలని కోరారు. పెన్షన్ సమస్యల పరిష్కారానికి 9490345763 నంబర్లో తెలపాలని సూచించారు. సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు జేబీ మోహన్, జీఎం ఈఈ సెల్ కుమార్రెడ్డి, జీఎం ఫైనాన్స్ సుబ్బారావు, ఏజీఎం సివిల్ రామకృష్ణ, డీజీఎం పర్సనల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.