‘బోనాలు మీకు సమర్పిస్తాం.. బోగభాగ్యాలు మాకు ఇవ్వు తల్లీ..’ మొక్కులు చెల్లించుకున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు. శ్రావణమాసం సందర్భంగా ఆదివారం నాడు పల్లెపల్లెనా గ్రామదేవతలకు బోనాల వేడుకలు నిర్వహించారు.
ఇళ్ల నుంచి బోనాలు ఎత్తుకొని గ్రామశివార్లలోని గ్రామదేవతల ఆలయాల వద్దకు, ఊరి మధ్యలోని బొడ్రాయిల వద్దకు డీజేలు, డప్పుచప్పుళ్లు, ఆటపాటలతో చేరుకున్నారు. దీంతో బోనాల వేడుకలు జాతరను తలపించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పల్లెల్లోని ఇళ్లలో బంధుమిత్రులతో సందడి నెలకొంది. -నమస్తే నెట్వర్క్, ఆగస్టు 10