పోక్సో కేసులో దోషికి ఏడేళ్ల జైలు
ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను ఇంటి పక్కనే ఉంటున్న బోయినపల్లి వీరబాబు(40) మాయ మాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి..
ఖమ్మం రూరల్, మే 27 : ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను ఇంటి పక్కనే ఉంటున్న బోయినపల్లి వీరబాబు(40) మాయ మాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసరావు బుధవారం తీర్పు వెల్లడించారని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2023 మే 28న నిందితుడైన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన బోయినపల్లి వీరబాబు బాలికను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు.
టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 279/2023.SC.పొక్సో, 40/2023 U/S 323 354 (A)(B) 506 IPC సెక్షన్ 8 ఆఫ్ పొక్సో చట్టం, 2012 కింద కేసు నమోదు చేసిన అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వేగవంతంగా పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశామని తెలిపారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై మోపిన నేరం రుజువు కావడంతో తీర్పువెలువరించారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ శరత్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ అధికారులు ఎస్ఐ వెంకటకృష్ణ, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ ఎం.వెంకయ్య , కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, హోం గార్డ్ చిట్టిబాబును పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి ‘కాకా’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్.. డిసెంబర్ 1 నుంచి భారీ ప్రచారం, సంక్రాంతికి మెగా సందడి!
Ar Rahman | ‘రామాయణ’ కోసం 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Bigg Boss 10 | అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొకటి! నీతూ మాస్టర్ ఎలిమినేట్,సుధీర్‌కు ఊహించని సేవింగ్
TGSRTC | ఆర్టీసీ ప్రయాణాలపై కరువు ఎఫెక్ట్!.. నీళ్లు లేకనే బస్సుల్లో జీవా బాటిల్స్ బంద్
Jagadish Reddy | సాగర్ దోపిడీపై సమరభేరి.. ఉమ్మడి నల్లగొండ ప్రజలను ఏకం చేసి పోరాడుతం: జగదీశ్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

