సమాజమే శిల్పం.. ‘ఆమె’నే శిల్పి
“మన సమాజం ఒక శిల్పం. ఆ శిల్పాన్ని చెక్కింది మహిళలు” అని, సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి పి.అరుణకుమారి అన్నారు. స్థానిక జేవీఆర్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో గురువారం మహిళా దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథి అరుణకుమారి మాట్లాడుతూ..
- మహిళా దినోత్సవంలో సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి
సత్తుపల్లి టౌన్, మార్చి 7: “మన సమాజం ఒక శిల్పం. ఆ శిల్పాన్ని చెక్కింది మహిళలు” అని, సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి పి.అరుణకుమారి అన్నారు. స్థానిక జేవీఆర్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో గురువారం మహిళా దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథి అరుణకుమారి మాట్లాడుతూ.. ఏదేని మంచి పనిని సాధించాలని మహిళలు గట్టిగా సంకల్పిస్తే తప్పక సఫలీకృతులవుతారని అన్నారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో..
వేంసూరు, మార్చి 7: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ ఇందుప్రియాంక, డాక్టర్ పల్లవి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు మల్లీశ్వరి, భవాని, వెటర్నరీ డాక్టర్ షఫియా, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాసుందరిని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని సన్మానించారు.
సింగరేణి ఉద్యోగుల ఆధ్వర్యంలో…
సత్తుపల్లి టౌన్, మార్చి 7: పట్టణంలోని సింగరేణి ఉద్యోగులు గురువారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. సింగరేణి ఉద్యోగినులను ముఖ్య అతిథి, ఎమ్మెల్యే మట్టా రాగమయి సత్కరించారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, సింగరేణి పీవో వెంకటాచారి పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..
మధిర, మార్చి7: మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ టీ.నాగలక్ష్మీ, కోర్టు సిబ్బంది దివి హనీషా, భానవ, శ్రావణి, వందన, అనూష, దివ్య, భారతమ్మ, మహిళా న్యాయవాది తూములూరి సంధ్యను ఘనంగా సన్మానించారు.
దెందుకూరులో…
మధిరరూరల్, మార్చి 7: మండలఃలోని దెందుకూరులో మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.
ఎర్రుపాలెంలో..
ఎర్రుపాలెం, మార్చి 7: మండలంలోని జమలాపురం యూనియన్ బ్యాంకులో మహిళా ఖాతాదారులైన వాసిరెడ్డి శివకుమారి, సామునూరి సుశీలమ్మను బ్యాంకు మేనేజర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో సిబ్బంది సన్మానించారు.
డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో..
కొణిజర్ల, మార్చి 7: మండలంలోని బస్వాపురం గ్రామంలో మహిళా సాధికారత, మెహందీ, ముగ్గుల పోటీలను డ్వాక్రా సంఘాలు నిర్వహించాయి. విజేతలకు బహుమతులను ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు అందజేశారు.
మహిళా దినోత్సవం వేడుకలు..
కూసుమంచి(నేలకొండపల్లి), మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా నేలకొండపల్లిలో మదర్ తెరిసా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం వేడుకలు జరిగాయి. అధ్యక్షురాలు బొల్లికొండ శ్రీలత, ఎంపీపీ వజ్జా రమ్య, ఎంపీడీవో ఎర్రయ్య, ఏపీఎం సునీత, ఎంపీటీసీ బొందయ్య, ఏపీఎం అశోక్రాణి, మహిళలు పాల్గొన్నారు.
యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో..
ఖమ్మం వ్యవసాయం, మార్చి 7: మహిళా దినోత్సవం సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో గురువారం వేడుకలు నిర్వహించారు. నగరంలోని ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మహిళలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు.
‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి’??
రఘునాథపాలెం, మార్చి 7: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు బానోతు ప్రమీల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోటరీనగర్లో గురువారం జరిగిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. అలాగే, దానవాయిగూడెం మహాత్మాగాంధీ బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలోనూ, బూడిదెంపాడు అంగన్వాడీలోనూ వేడుకలు నిర్వహించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

