బోనకల్లు, మే 22 : ఎరువులు, పురుగుమందులు, విత్తన డీలర్లు అందరూ చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య అన్నారు. గురువారం బోనకల్లు మండల కేంద్రంలోని రైతు వేదికలో మధిర డివిజన్ స్థాయి డీలర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. డీలర్లు అందరూ రైతులకు బిల్లులు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్స్ మెయింటెన్ చేయాలని, ఏ రోజుకి ఆ రోజు స్టాక్ రిజిస్టర్ అప్డేట్ చేయాలన్నారు. అలాగే లైసెన్స్ రెన్యువల్స్, పీసీలు అప్డేట్ చేసుకోవాలన్నారు.
మధిర సహాయ సంచాలకులు ఎస్.విజయచంద్ర మాట్లాడుతూ.. E POS మిషన్ ద్వారానే ఎరువులు అమ్మాలన్నారు. విత్తన చట్టంలోని నియమ నిబంధనలను ఏడీఏ టెక్నికల్ ఖమ్మం వాసవి రాణి డీలర్స్కు వివరించారు. అనంతరం మధిర డివిజన్లోని డీలర్స్ అందరికీ E POS మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ టెక్ ఖమ్మం పవన్, మధిర డివిజన్ ఏఓ వినయ్ కుమార్, సాయి దీక్షిత్ (మధిర), మానస (చింతకాని), సాయి శివ (ఎర్రుపాలెం), చింతకాని మండల ఎస్ఐ నాగులుమీరా, మధిర ఎస్ఐ లక్ష్మీ భార్గవి, ఏఈఓ బోనకల్ రజిత పాల్గొన్నారు.