‘పోడు’ పట్టాల జారీకి చర్యలు చేపట్టాలి
పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోడు భూముల ప్రత్యేక అధికారి డాక్టర్ యోగితారాణా సూచించారు.
- జిల్లా స్థాయి దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలి
- అభ్యంతరాలను పరిశీలించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
- సమీక్షలో పోడు భూముల ప్రత్యేక అధికారి యోగితారాణా
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 8: పోడు భూముల పట్టాల జారీకి చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోడు భూముల ప్రత్యేక అధికారి డాక్టర్ యోగితారాణా సూచించారు. అటవీ హకు పత్రాల జారీ అంశంపై ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు, రెవెన్యూ, అటవీ అధికారులతో ఖమ్మం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలాకాలంగా ఉన్న పోడు భూముల సమస్యలకు పరిషారం లభించనుందని అన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న వారి నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించామని, క్షేత్రస్థాయిలో పరిశీలించామని అన్నారు. ఇక నుంచి గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారికి పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 25,515 ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు అందించాలంటూ 9,507 మంది గిరిజనులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో సర్వే, విచారణ, గ్రామసభల్లో తీర్మానం, డివిజన్ స్థాయిలో ఎస్డీఎల్సీకి పంపడం, అకడ ఆమోదం పొందడం, తదుపరి జిల్లాలో జిల్లాస్థాయి అటవీ హకుల కమిటీకి సిఫారసు చేయడం వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు.
షెడ్యూల్ తెగలకు సంబంధించి 6,989 దరఖాస్తులు 11,462.32 ఎకరాల కోసం, అదనపు ప్యాచుల కోసం 2,598 దరఖాస్తులు 2,535.35 ఎకరాల కోసం అందినట్లు చెప్పారు. ఈ దరఖాస్తుదారులంతా కలిపి మొత్తం 13,997.67 ఎకరాల్లో స్వాధీనంలో ఉన్నారన్నారు. గ్రామసభలో 6,795 దరఖాస్తులు, 2,556 అదనపు ప్యాచ్‌లు కలిపి మొత్తంగా 13,656.95 ఎకరాలకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఇప్పటి వరకు 3,315 దరఖాస్తులు 4,359.38 ఎకరాలకు గాను ఆమోదం పొందినట్లు చెప్పారు. అన్ని దరఖాస్తులనూ జిల్లాస్థాయి సమావేశంలో పరిశీలించాలని, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అభ్యంతరాలుంటే పరిశీలించి ప్రతి ఒకరికీ న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిలా దరఖాస్తులు, పరిశీలన, గ్రామసభల సిఫార్సులపై సమీక్షించారు. ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లాల రెవెన్యూ, అటవీ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

