కారేపల్లి, జూన్ 26 : కారేపల్లి మండలం ఎర్రబోడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కేవైఏ ఖమ్మం యూత్ అసోసియేషన్ ఎన్జీఓ ఆధ్వర్యంలో స్కూల్ కిట్టు వితరణ చేశారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, ఇతర సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోమట్లగూడెం హైస్కూల్, ఎర్రబోడు స్కూల్ హెచ్ఎంలు టీ.శారద, పి.చంద్రశేఖర్, రమేశ్, మాజీ సర్పంచ్ కుర్సం సత్యనారాయణ, జీపీ కార్యదర్శి రాజేశ్వరి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పద్మవీణ, ఉపాధ్యాయులు రమాదేవి, కుర్సం కృష్ణకుమారి, ఉమాదేవి, గ్రామ పెద్దలు పండగ కొండయ్య, బొజెడ్ల గోవిందరావు, ముక్కపాటి మోహన్ రావు, రాంబాబు, రామకృష్ణ, నరేందర్, యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.