ఖమ్మం రూరల్, జనవరి 17 : ఇటీవల నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఎస్సీ మహిళకు అవకాశం దక్కింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా మున్సిపాలిటీ కార్పొరేషన్లు, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. అందులో భాగంగానే నూతన మున్సిపాలిటీగా ఆవిర్భావం చెందిన ఏదులాపురం మున్సిపాలిటీ పగ్గాలు ఎస్సీ మహిళకు కట్టబెడుతూ రిజర్వేషన్ వెలువడింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా వాటిలో 16 స్థానాలు జనరల్ కేటగిరికి కేటాయించగా ఎస్సీకి 7 స్థానాలు, ఎస్టీకి 3 స్థానాలు, బీసీలకు 6 స్థానాలు రిజర్వ్ కాబడ్డాయి. వార్డుల వారిగా రిజర్వేషన్లను పరిశీలిస్తే 1వ వార్డు ఎస్సీ, 2వ వార్డు జనరల్ మహిళ, 3వ వార్డు బీసీ మహిళ, 4వ వార్డు జనరల్ మహిళ, 5వ వార్డు జనరల్, 6వ వార్డు జనరల్ మహిళ, 7వ వార్డు జనరల్, 8వ వార్డు బీసీ మహిళ, 9వ వార్డు ఎస్సీ జనరల్,
10వ వార్డు ఎస్సీ జనరల్, 11వ వార్డు జనరల్ మహిళ, 12వ వార్డు బీసీ జనరల్, 13వ వార్డు బీసీ జనరల్, 14వ వార్డు జనరల్, 15వ వార్డు జనరల్ మహిళ, 16వ వార్డు ఎస్సీ జనరల్, 17వ వార్డు ఎస్సీ ఉమెన్, 18వ వార్డు జనరల్ మహిళ, 19వ వార్డు బీసీ మహిళ, 20వ వార్డు బీసీ జనరల్, 21వ వార్డు ఎస్సీ మహిళ, 22వ వార్డు జనరల్, 23వ వార్డు ఎస్సీ మహిళ, 24వ వార్డు ఎస్టీ జనరల్, 25వ వార్డు జనరల్, 26వ వార్డు ఎస్టీ ఉమెన్, 27వ వార్డు ఎస్టీ జనరల్, 28వ వార్డు జనరల్, 29వ వార్డు జనరల్ మహిళ, 30వ వార్డు జనరల్ మహిళ, 31వ వార్డు జనరల్ మహిళ, 32వ వార్డు జనరల్ స్థానాలకు రిజర్వు కాబడ్డాయి.