కారేపల్లి,మార్చి 24: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) పీహెచ్సీ హైదరాబాద్ శాఖ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లిలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం విరాళంగా రూ.2లక్షల విలువైన ఫర్నిచర్ ను అందించింది. మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మి స్థానిక స్థానిక బ్రాంచ్ మేనేజర్ రవీంద్ర నాయక్‌తో కలిసి మండల వైద్యాధికారి భూక్య సురేష్ నాయక్‌కు ఎలక్ట్రానిక్ వాటర్ ఫిల్టర్, కుర్చీలు, టేబుల్, ఫీల్ చైర్స్ తదితర సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సురేష్ మాట్లాడుతూ..ఎస్బీఐ సామాజిక బాధ్యతలో భాగంగా పలు రకాల ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రజానీకానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం అభినందనీయం అన్నారు.