ఫ్రెంచ్ బ్రెడ్లు: రెండు
కీరా : ఒకటి, క్యాప్సికం: ఒకటి
పుదీనా ఆకు: సగం కప్పు
కొత్తిమీర: కప్పు, అల్లం : అంగుళం ముక్క
పుట్నాల పప్పు: టేబుల్ స్పూను
పచ్చిమిరపకాయలు: రెండు
నిమ్మకాయ: సగం, ఉల్లిపాయ: ఒకటి
టమాటా కెచప్: టేబుల్ స్పూన్
బటర్ ముక్క: ఒకటి
చక్కెర: అరస్పూను
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
ఈ హాట్డాగ్ను తయారు చేసుకోవడానికి ముందుగా మనం పుదీనా చట్నీ చేసుకోవాలి. అందుకోసం కొత్తిమీర, పుదీన, పచ్చిమిరపకాయలు, పుట్నాలను మిక్సీలో వేసి అందులోనే నిమ్మరసం పిండుకోవాలి. చక్కెర, ఉప్పు కూడా జోడించి మెత్తగా రుబ్బుకోవాలి. కీరా, క్యాప్సికం, ఉల్లిపాయలను తీసుకొని సన్నగా పొడవాటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బన్లను తీసుకుని నిలువుగా సగానికి కోయాలి. అయితే రెండు ముక్కలు అయ్యేలా చివరి దాకా కోయకూడదు. బన్ను లోపల కొద్దిగా బటర్ రాసి, దాని మీద ఇందాక చేసి పెట్టుకున్న పుదీనా చట్నీ కూడా రాయాలి. ఒక స్పూను కెచప్ వేయాలి. తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు చల్లి అటూ ఇటూ కలుపుకోవాలి. వాటిని బన్నులో కూరాలి. ఇప్పుడు పెనం మీద కొద్దిగా బటర్ వేసి ఈ బన్నులను ఉంచి సన్నటి మంట మీద కాల్చితే, ఆరోగ్యకరంగా తినేందుకు వేడి వేడి హాట్ డాగ్ సిద్ధమైపోతుంది.
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు