కారేపల్లి, జూలై 21 : మధిర పట్టణంలో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన సీపీఐ 23వ జిల్లా మహాసభల్లో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం నుంచి సిపిఐ జిల్లా సమితి సభ్యులుగా కారేపల్లి మండల కార్యదర్శిగా ఉన్న పాపినేని సత్యనారాయణ, బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన ఉంగరాల సుధాకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రావి శివరామకృష్ణ సోమవారం తెలిపారు. కారేపల్లి మండలంలో పార్టీ విస్తరణకు కృషి చేయాలని, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు వారి నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.