పెనుబల్లి, ఏప్రిల్ 11: ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా జరుపుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కల్లూరులో శుక్రవారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ కల్లూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో జరుగనున్నదని పేర్కొన్నారు. అనంతరం సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న ప్రతీ గ్రామంలో ఉదయం పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రేణులు ఇప్పటి నుంచే కష్టపడి పని చేయాలని కోరారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు కట్టా అజయ్‌కుమార్, లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, కొరకొప్పు ప్రసాద్, సీహెచ్.కిరణ్‌కుమార్, పెడగంటి రామకృష్ణ, షేక్ కమ్లీ, మేకల కృష్ణ, రవూఫ్, నర్వనేని అంజయ్య, దేవరపల్లి భాస్కర్‌రావు, ఉబ్బన వెంకటరత్నం, మాజీ సర్పంచ్‌లు నందిగాం ప్రసాద్, వెంకటరెడ్డి, పుల్లారెడ్డి, సామేలు పాల్గొన్నారు.