పెనుబల్లి/ వైరా టౌన్, ఏప్రిల్ 9: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించబోతున్నామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. తల్లాడ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి గృహంలో ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో అంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు. మంత్రి పొంగులేటి ఇలాకాలో ఇంతవరకు ఒక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు.
అనంతరం బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దుగ్గిదేవర వెంకట్లాల్, పట్టణ అధ్యక్షుడు జీవీ.ఆర్, బద్దం కోటిరెడ్డి, తేళ్లూరి రఘు, కేతినేని చలపతిరావు, దిరిశాల దాసురావు, గుండ్ల వెంకటేశ్వరరావు, గుండ్ల నాగయ్య, ఇజ్జగాని గోవిందరావు, గరిడిపల్లి రాము, యూసుఫ్, జమలయ్య, నరసింహ, రామిరెడ్డి, పోతులూరి వెంకట్, తాళ్లూరి నరసింహారావు, వజ్రాల రామిరెడ్డి, అంబేద్కర్, ఉదయ్, సీతారామిరెడ్డి, వనిగళ్ల అశోక్, చావా నాగేశ్వరరావు, కట్టా రామారావు, వీరయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.