సత్తుపల్లి, ఏప్రిల్ 24 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరూ తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో రాయల వెంకటశేషగిరిరావు ఇంటి వద్ద పార్టీ ముఖ్య నాయకుల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు దండులా కదలిరావాలని కోరారు.
అలాగే మే 5న డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో సండ్ర ఆ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, నాయకులు దుగ్గిదేవర వెంకట్‌లాల్, కనగాల వెంకట్రావు, నాయుడు శ్రీనివాసరావు, దిరిశాల దాసురావు, కేతినేని చలపతిరావు, మువ్వా మురళి, వజ్రాల రామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముదిగొండ, ఏప్రిల్ 24 : గులాబీ శ్రేణులు దండుకట్టి రజతోత్సవ సభకు కదలిరావాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. హనుమకొండలో ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మేడేపల్లి గ్రామంలో గురువారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలో స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు, పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, సామినేని హరిప్రసాద్, పోట్ల ప్రసాద్, గడ్డం వెంకట్, తోట ధర్మ, భిక్షం, కోటి అనంతరాములు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం, ఏప్రిల్ 24: ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. సాధారణ సభ మాత్రమే కాదని, తెలంగాణ భవిష్యత్‌కు దారి చూపే వేదికని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సభ విజయవంతంలో ప్రతి కార్యకర్తా తనవంతు భాగస్వామ్యం అందించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారని, ఆగమవుతున్న తెలంగాణను రక్షించుకునేందుకు ప్రజలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని వివరించారు. అలాగే, శ్రేణులు సభకు తరలివెళ్లేందుకు వాహనాల ఏర్పాట్లు చురుగా కొనసాగుతున్నట్లు చెప్పారు. యువతీ యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు అంతా ఈ సభకు హాజరుకావాలని కోరారు.
ఇల్లెందు, ఏప్రిల్ 24: బీఆర్ఎస్ ఆవిర్భవించి పాతికేళ్ల పండుగ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఇల్లెందు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్దామని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ పిలుపునిచ్చారు. రజతోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పార్టీ శ్రేణులతో కలిసి ఇల్లెందు పట్టణంలో గురువారం వారు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆవిర్భవించిన బీఆర్ఎస్.. సుదీర్ఘ ఉద్యమంతో స్వరాష్ట్ర కలను సాకారం చేసిందని గుర్తుచేశారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్లలో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని జ్ఞప్తికి తెచ్చారు. బీఆర్ఎస్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, పరుచూరి వెంకటేశ్వర్లు, రంగనాథ్, దివిలాల్, జాఫర్ హుస్సేన్, శీలం రమేశ్, ఖమ్మంపాటి రేణుక, భావ్‌సింగ్‌నాయక్, అబ్దుల్ నబీ, తోట లలిత, శారద, గిన్నారపు రాజేశ్, హరికృష్ణ, కాసాని హరిప్రసాద్, వీరస్వామి, చాంద్‌పాషా, లలిత్‌కుమార్ పాసి, డేరంగుల పోశం, ఎలమద్ది రవి, సరిత, చంద్రావతి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.