పెనుబల్లి (కల్లూరు), ఫిబ్రవరి 6: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ప్రజలందరికీ సుపరిపాలన అందిందని, కల్లూరు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేసి ఆయనకు కానుక ఇద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, ఉద్యమ నాయకుడు దిండిగాల రాజేందర్‌తో కలిసి అంబేద్కర్‌నగర్, శాంతినగర్, శ్రీరామపురంకాలనీ, ఖాన్ఖాన్పేట, ఎన్ఎస్పీ అడ్డరోడ్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ రామరాజ్యం లాంటి పరిపాలన అందించారని, ప్రజలు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేస్తూ పాలనను ఇంటి ముందుకు తీసుకొచ్చారని, నాడు ఆయన అందించిన పథకాల ఫలాలే, అభివృద్ధే ప్రతి ఇంట్లో, ప్రతి ఊరులో కనిపిస్తుందన్నారు.
అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని, మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, మాజీ జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, సీనియర్ నాయకుడు లక్కినేని రఘు, పెనుబల్లి మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, వేము కృష్ణ, తేజావత్ తావునాయక్, మేకల కృష్ణ, కోట ప్రభాకర్, నాగరాజు, బరోత్ రాము, మరకాల కంటి, లగడపాటి శ్రీను, గోదా చెన్నారావు, మరకాల వెంకీ, సయ్యద్ గౌస్, ఆళ్ల రాంబాబు, నరసింహారావు పాల్గొన్నారు.