రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి.. ప్రాణభిక్ష ప్రసాదించండి..
విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన తాను.. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి వైద్య చికిత్స పొందేందుకు ఖర్చులకు చేతిలో చిల్లి గవ్వలేక ఆర్థికంగా సతమతమవుతున్నానని అన్నారు.
- ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, రెవెన్యూ మంత్రులకు రిటైర్డ్ హెచ్ఎం వేడుకోలు
- రిటైర్మెంట్ పొంది ఏడాది దాటినా ప్రభుత్వం నా బెనిఫిట్లను ఇవ్వడం లేదు
- రూ.60 లక్షల బెనిఫిట్స్ రాక ఆర్థికంగా, అనారోగ్యంగా సతమతమవుతున్నాను
- క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రాణం కోసం పోరాడుతున్నా సర్కారు స్పందించట్లేదు
- ఖమ్మంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు చెరుకుపల్లి వెంకయ్య కంటతడి
మయూరిసెంటర్, మే 17: విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన తాను.. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి వైద్య చికిత్స పొందేందుకు ఖర్చులకు చేతిలో చిల్లి గవ్వలేక ఆర్థికంగా సతమతమవుతున్నానని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో చికిత్స చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అశ్వారావుపేట జడ్పీఎస్‌ఎస్‌లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందినట్లు తెలిపారు.
దీంతో ప్రభుత్వం నుంచి తనకు వివిధ రకాల బెనిఫిట్స్ నగదు రూ.60 లక్షలు రావాల్సి ఉందని అన్నారు. అవి నేటికీ రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం క్షీణించిందని, గుండెకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడంతో వైద్యులు రెండు స్టంట్లు వేశారని అన్నారు. ప్రాంక్రియా, క్యాన్సర్‌తోపాటు ఇంకా వివిధ అనారోగ్య సమస్యలు తనకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. తన వద్ద ఉన్న నగదునంతా చికిత్స కోసం ఖర్చు చేశానని, ఇప్పుడు తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్యాన్సర్, ఇతర వ్యాధులకు చికిత్స తీసుకోవాలంటే దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. హైదరాబాద్, ఖమ్మంలోని అనేక ఆసుపత్రుల్లో వైద్యం కోసం తీరుగుతున్నానని అన్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవంతో తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని, సమయానికి సరైన చికిత్స చేయించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన ఆరోగ్యం క్షీణిస్తోందని, తనను ఇలాంటి పరిస్థితుల్లో చూసి తన కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారని కంటతడి పెట్టుకున్నారు. తన ప్రాణాపాయ స్థితిని గమనించి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి, రెవెన్యూ మంత్రి స్పందించాలని కోరారు. కలెక్టర్, డీఈవో, ఇతర ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తనకు అందించిన తనకు ప్రాణభిక్ష ప్రసాదించాలని వేడుకున్నారు. ఆయనకు మద్దతుగా బంధువులు, వివిధ సంఘాల నాయకులు కొత్తపల్లి గురుప్రసాద్, మడిపల్లి బాబు, ఎల్లంకి జయపాల్, జమలయ్య, మేళ్లచెరువు బాబు, చెరుకుపల్లి మురళీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

