మధిర, మార్చి 19 : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నెల్లూరు రమేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. 16 సంవత్సరాల పాటు దేశ భద్రత కోసం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 2016లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత 2018లో గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం సాధించాడు. 2020 వరకు విధులు నిర్వహించి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనంతరం బీఈడీ పూర్తి చేశాడు. ఉన్నత ఉద్యోగాల సాధనకు నిరంతర కృషి సాగించాడు.
టీఎస్పీఎస్సీ విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. ఇటీవల నియామక పత్రం అందుకున్నాడు. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రిపరేషన్ కొనసాగించి వరుస ఉద్యోగాలు సాధించడంపై రమేశ్‌కు స్థానికులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు.