కారేపల్లి, సెప్టెంబర్ 24 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం చీమలపాడు ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రంలో చెడిపోయిన విద్యుత్ మోటార్‌కు మరమ్మతులు చేపించాలని స్థానిక ఎం ఎల్ హెచ్ పి కళ్యాణి, ఏఎన్ఎం ముక్తి నాగమణి బుధవారం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోరు మరమ్మతు కారణంగా సబ్ సెంటర్లో నీటి సమస్య తలెత్తిందన్నారు. వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు, మందుల కోసం సబ్ సెంటర్‌కు వచ్చే ప్రజలు సైతం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావునా అధికారులు వెంటనే స్పందించి బోరు మరమ్మతు చేపించాలని వారు కోరారు.