కారేపల్లి, అక్టోబర్ 27 : కారేపల్లి మండలం గేటుకారేపల్లిలో వీధి లైట్లు, డ్రైనేజీ సమస్య పరిష్కారించాలని కోరుతూ డీవైఎఫ్ఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. రాత్రి సమయంలో వీధి లేట్లు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని వినతిలో తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్ధ లేకపోవడంతో వర్షపు నీరు ఇండ్లలో నిల్వ ఉండి వ్యాధులకు కారణమవుతుందన్నారు. గేటుకారేపల్లిలో సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీఓ పి.శ్రీనినాసరావు, తాసీల్దార్ అనంతుల రమేశ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆదెర్ల వినయ్‌కుమార్, నాయకులు గడ్డం దిలీప్, కాకాటి పృథ్వీ పాల్గొన్నారు.