కొత్తగూడెం సింగరేణి/ మణుగూరు టౌన్/ సత్తుపల్లి టౌన్/ ఇల్లెందు, జూలై 2 : అపరిష్కృతంగా, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై యాజమాన్యం, ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ సింగరేణి అధికారులు చేపట్టిన దీక్షలు గురువారం నాటికి నాల్గవ రోజుకు చేరాయి. పే అప్గ్రేడేషన్ను తక్షణమే అమలు చేయాలని, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే వెంటనే విడుదల చేయాలని అధికారులు నినాదాలు చేశారు.
కొత్తగూడెం సింగరేణిలో, మణుగూరులో ఏరియా జీఎం కార్యాలయం ఎదుట, సత్తుపల్లిలో ఎస్సీసీఎల్ ఏరియాలో, ఇల్లెందు జీఎం కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంఓఐ) ఎస్సీసీఎల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో అధికారులు కూర్చోగా.. పలువురు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధిలో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారుల పట్ల యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలన్నారు.
ఆశించిన ఫలితం సాధించే వరకు ఉద్యమాన్ని శాంతియుతంగా, క్రమశిక్షణతో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కొత్తగూడెంలో దీక్షల్లో డీజీఎం ట్రాన్స్‌పోర్టు సీతారాం, డీజీఎం ఐఈ వసంతరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కే.విజయ్‌కుమార్, అడిషనల్ మేనేజర్ సురేశ్, డీవైఎస్ఈ ప్రవీణ్, డీవైపీఎం దేవేందర్‌రెడ్డి, సీనియర్ ఏవో అక్షయ్, మంజునాథ్, మణుగూరులో దీక్షల్లో సత్యనారాయణ, సుధీర్, వేణుగోపాల్, రాజ్‌కుమార్, శ్రీనివాస్, దీక్షిత్, హరిప్రసాద్, నరేశ్, తరుణ్, డి.రమేశ్, ఎం.వినయ్, రఘురాం, ఇల్లెందు దీక్షల్లో అధికారుల సంఘం నాయకులు డి.మధుసూదన్‌రావు, రవీందర్‌కుమార్, కె.రాందాస్, కమల్ దీప్, వీసం కృష్ణయ్య, జి.శివప్రసాద్, కేశవరావు, కిషన్, వినోద్, శ్రీనివాస్, నరేశ్‌కుమార్, వరుణ్‌కుమార్, యుగంధర్, శ్రీకాంత్, రాజేశ్, నగేశ్ కూర్చున్నారు.
