కూసుమంచి, మే 19: జనగణన విషయంలో యాప్ ద్వారా ఇచ్చిన ప్రతి విషయాన్ని పరిశీలించి నమోదు చేయాలని, ఎక్కడా తప్పిదం జరగకుండా ఎన్యూమరేటర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కూసుమంచిలో జరుగుతున్న జనగణన ప్రక్రియను మంగళవారం ఆయన పరిశీలించారు. ఎస్సీ కాలనీలో నలగాటి నర్సమ్మ ఇంటి వద్దకు వెళ్లిన కలెక్టర్ 34 ప్రశ్నలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదయ్యే వరకు అక్కడే ఉండి ఉపాధ్యాయురాలు స్వరూపకు పలు సూచనలు చేశారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఎన్యూమరేటర్లు టోపీలు పెట్టుకోవాలని, ఎండదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాని కలెక్టర్ సూచించారు. తహసీల్దార్ సైదులు, సూపర్వైజర్ బొల్లికొండ పాపారావు, సీపీవో శ్రీనివాస్, జనగణన అధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు. అనంతరం కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.