
ఖమ్మం :ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్ గుమ్మడివెల్లి విశ్వనాథం(70) సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పార్థీవదేహాన్ని పలువురు సందర్శించారు. వీరిలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బాణోత్ వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీమియా, ఖమ్మం నగర అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శి మహేష్, కోశాధికారి బాబు, పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.